ఆంధ్రటాప్ స్టోరీస్

ద్వారంపూడీ.. తాటతీస్తాం!

  • జగన్‌కు సిగ్గూ లజ్జా లేవు
  • మహిళల్ని బూటుకాళ్లతో తన్నించారు
  • టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజం

టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్‌ చేసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. ద్వారంపూడిపై ఏ చర్యలు తీసుకోకుంటే అతని వ్యాఖ్యల వెనుక జగన్‌ హస్తమున్నట్టుగా భావించాల్సి వస్తుందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘రాజకీయంగా జగన్‌పై మేము చాలా విమర్శలు చేశాం. కానీ ఇలా ఎన్నాడూ తిట్టలేదు. మూడుసార్లు ఎమ్మెల్యేనయ్యానని గొప్పలు పోతున్నాడేమో.. ఏం ద్వారంపూడీ తాటతీస్తాం ఏమనుకుంటున్నావో… కొవ్వుంటే దాన్ని చెక్కుతాం…మీ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాం. ఒళ్లు కాస్త దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మసలుకోండి’’ అంటూ హెచ్చరించారు. కాకినాడలో ఆయిల్‌, ఇసుక, భూ, మైనింగ్‌ మాఫియాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ద్వారంపూడి అని ఆరోపించారు. మృతుల పేర్లమీద పెన్షన్లు కొట్టేసేది, కాల్‌మనీ వ్యాపారం చేసేదీ ఆయనేనని మండిపడ్డారు. ‘‘జగన్‌ను చూచి చంద్రబాబు నేర్చుకోవాలా! నీకేమైనా పిచ్చా? ఏం నేర్చుకోవాలి. రూ.43వేల కోట్లు దోచుకోవడం నేర్చుకోవాలా! 16నెలలు జైల్లో ఎలా ఉండాలో నేర్చుకోవాలా! ఊరూరా ప్యాలె్‌సలు కట్టుకోవడం నేర్చుకోవాలా! హత్యలు, ఫ్యాక్షనిజం గురించి నేర్చుకోవాలా!? రైతులను చావగొట్టించడమెలాగో నేర్చుకోవాలా! తప్పుడు కేసులు పెట్టించడం గురించి నేర్చుకోవాలా!? అసలు జగన్‌లో ఒక్క మంచి లక్షణమైనా ఉందా చూసి నేర్చుకోవడానికి’’ అని వెంకన్న సెటైర్లు వేశారు. అధికారం ఉన్నా, లేకున్నా రోజుకు 16గంటలు పనిచేస్తున్న చంద్రబాబును కుంభకర్ణుడంటావా. ఇంటిపక్క 25రోజులుగా రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అనేక రకాలుగా ఆందోళన చేస్తుంటే నోరు మెదపకుండా కూర్చున్న జగనే కుంభకర్ణుడి తాతని విమర్శించారు. ట్విటర్లోనూ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ‘‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది జగన్‌. ఏడు నెలల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వం నాకించి ప్రజలు పండుగకు దూరం అవ్వడానికి చంద్రబాబు కారణమంటే ఎలా విజయసాయిరెడ్డి గారూ? మేం పండుగ చేసుకుంటే చాలు అనుకునేది వైఎస్‌ కుటుంబం. ప్రజలు కష్టాల్లో ఉంటే మనం పండుగ చేసుకోవడం కరెక్ట్‌ కాదు అనుకునేది చంద్రబాబు కుటుంబం. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల్ని బూటు కాలితో తన్నించిన జగన్‌కు సిగ్గు, లజ్జ లేవు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నవారిపై అక్రమ కేసులా? చిన్నపిల్లాడిని కూడా పోలీసు వ్యాన్‌ ఎక్కిస్తారా? నువ్వు, జగనా సిగ్గు గురించి మాట్లాడేది. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని.. వంగి దండాలు పెడుతున్న మీది సిగ్గులేని జన్మ’’ అంటూ దుయ్యబట్టారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close