ఆంధ్రవిజయనగరం జిల్లా

విజయనగరంలో బాంబు కలకలం

  • రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్‌
  • అప్రమత్తమైన అధికార యంత్రాంగం

విజయనగరం టౌన్‌:విజయనగరం రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందంటూ ఓ అపరిచిత వ్యక్తి 100కు చేరిన ఫోన్‌కాల్‌ కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం వచ్చిన కాల్‌తో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది.  జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్‌లో అడుగడుగునా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులతోపాటు వన్‌ టౌన్‌ పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌ అడుగడుగునా తనిఖీలు చేశారు. అయితే ఫోన్‌ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్‌చేసినా ఫలితం లేకపోవడంతో అది ఫేక్‌కాల్‌గా భావించకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రాత్రి పదిన్నర గంటలకూ అణువణువూ తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close