సినిమా

సోనూసూద్ ను ఫాలో అవుతున్న హృతిక్‌రోష‌న్

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ లాక్ డౌన్ టైంలో గొప్ప మ‌న‌సు చాటుకుని రియ‌ల్ హీరో అనిపించుకున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని స్వంత డ‌బ్బుల‌తో వారిండ్ల‌కు పంపించే ఏర్పాట్లు  చేసి..ప్ర‌శంస‌లందుకున్నాడు. ఆ త‌ర్వాత ఆప‌ద‌లో ఉన్న‌వారికి నేనున్నా అంటూ అండ‌గా నిలిచాడు. లాక్ డౌన్ ప్ర‌భావం నుంచి ఇంకా భార‌త్ తోపాటు చాలా దేశాలు కోలుకోలే‌ని ప‌రిస్థితి. 

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కూడా త‌న‌వంతుగా మోటివేట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. యువ‌త‌లో ఉన్న టాలెంట్ ను ప్రోత్స‌హిస్తున్నాడు. ఇన్ స్టా యూజ‌ర్ ఇష్నా కుట్టీ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. దీనికి హృతిక్ స్పందిస్తూ అంద‌మైన డ్యాన్స్ ఫ్లో. చాలా బాగుంది రిప్లై ఇచ్చాడు. హృతిక్ త‌న డ్యాన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించేస‌రికి  షాకైన ఇష్నా కుట్టీ ఎగిరి గంతేసింది. హృతిక్ స్పంద‌న‌తో సంతోషంతో ఏడ్చేశాను.. ధ‌న్య‌వాదాలు అని కామెంట్ పెట్టింది. 

లండ‌న్ బ్యాలెట్ స్కూల్ కోసం విరాళాల సేక‌ర‌ణ‌లో భాగంగా డ్యాన్స‌ర్ అయిన‌ యువ‌కుడు క‌మ‌ల్ సింగ్ పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఆ యువ‌కుడికి హృతిక్ అండ‌గా నిల‌వ‌డమే కాకుండా స్కూల్ కోసం కొంత మొత్తాన్ని కూడా అందించాడు. క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న వారికి అండ‌గా నిలిచేందుకు, వారి ముఖాల్లో చిరున‌వ్వు తెప్పించేందుకు హృతిక్ చేస్తున్న కృషిని మెచ్చుకోవాల్సిందే.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close