సినిమా

ట్రాక్‌పైకి రానున్న‌ స‌ల్మాన్‌ఖాన్ ‘టైగ‌ర్ 3’ ..!

ప్ర‌స్తుతం రాధే, అంతిమ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. రాధే ప్రాజెక్టు ఈద్ కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు ముస్తాబవుతోంది. ఈ రెండు చిత్రాల త‌ర్వాత స‌ల్మాన్ క‌భి ఈద్ క‌భి దివాళి సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప‌ర్హ‌ద్ సాంజీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రానుంది. ఇదిలా ఉంటే ఏక్తా టైగ‌ర్, టైగ‌ర్ జిందా హై ప్రాంఛైజీలో టైగ‌ర్ 3 చిత్రాన్నికూడా లైన్ లో పెట్టాడు స‌ల్లూభాయ్‌. ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించాయి.

బీటౌన్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మార్చి నెల నుండి టైగ‌ర్ 3 షూటింగ్ షురూ చేస్తాడ‌ట స‌ల్మాన్‌. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ కొన‌సాగించ‌నున్నాడు. య‌శ్ రాజ్‌ఫిలింస్ బ్యాన‌ర్ పై నిర్మించునున్న ఈ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్ కు జోడీగా మరోసారి క‌త్రినాకైఫ్ సంద‌డి చేయ‌నుంది. టైగ‌ర్ 3 సినిమాతో స‌ల్మాన్‌-క‌త్రినా హిట్ ఫెయిర్ ఆడియెన్స్ కు వినోదాన్ని అందించేందుకు ముస్తాబ‌వుతున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close