టాప్ స్టోరీస్రాజకీయం

హౌరాలో టైర్ల‌కు నిప్పంటించి బీజేపీ నిర‌స‌న

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే ల‌క్ష్యంగా తృణ‌మూల్ కాంగ్రెస్ హ‌త్యాకాండ కొన‌సాగిస్తున్న‌ద‌ని, ఈ హ‌త్య రాజ‌కీయాలు మానుకోవాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇవాళ న‌బ‌న్నా చ‌లో పేరుతో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టింది. ర్యాలీలో భాగంగా న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున న‌బ‌న్నాలోని స‌చివాల‌యానికి చేరుకోవాల‌ని భావించారు. అయితే, పోలీసులు వారిని ఎక్క‌డిక‌క్క‌డే అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. 

సెంట్ర‌ల్ కోల్‌క‌తా, హేస్టింగ్స్, హౌరా త‌దిత‌ర ప్రాంతాల్లో నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆపై వాట‌ర్ క్యాన‌న్‌లు, టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. దీంతో హౌరాలో నిర‌స‌న‌కారులు రెచ్చిపోయారు. హౌరా ప్ర‌ధాన కూడ‌లిలో టైర్లు త‌గుల‌బెట్టి నిర‌స‌న వ్య‌క్తంచేశారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close