టాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్రాజకీయం

చరిత్ర సృష్టించిన బీజేపీ.. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటమి!

  • 1,118 ఓట్లతో ఉత్కంఠభరిత విజయం సాధించిన రఘునందన్ రావు
  • చివరి రౌండ్ వరకు దోబూచులాడిన విజయం
  • రెండో స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్

దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ చిత్తు చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో జయకేతనం ఎగురవేశారు. ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్ లో చివరి మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించడంతో… బీజేపీ చివరకు విజయనాదం చేసింది. 1,118 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు.

గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు.. మూడో ప్రయత్నంలో ఘన విజయం అందుకున్నారు. బీజేపీ గెలుపుతో హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం వద్ద పండుత వాతావరణం నెలకొంది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close