అంతర్జాతీయంటాప్ స్టోరీస్

వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్‌ దంపతులు

న్యూయార్క్‌ : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తన 27 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకోబుతున్నారు. భార్య మెలిందా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా.. బిల్‌మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన దంపతులిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం షాక్‌కు గురి చేసింది.

వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్‌ దంపతులు

‘ఎన్నో సమాలోచనల అనంతరం మా వివాహ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. గత 27 ఏళ్లలో మేం ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో దంపతులుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ బిల్‌గేట్స్‌, మెలిందా ట్విట్టర్‌ ద్వారా సంయుక్త ప్రకటనలో ప్రకటించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు.

వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్‌ దంపతులు

మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్‌ సీఈవోగా ఉన్న సమయంలో 1987లో మెలిందా ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరారు. ఇద్దరూ తొలిసారిగా న్యూయర్క్‌ నగరంలో జరిగిన విందు కార్యక్రమంలో కలుసుకోగా.. ఆ తర్వాత 1 జనవరి, 1994లో హవాయిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. బిల్‌, మెలిందా దంపతులకు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, రోరిజాన్‌ గేట్స్‌, ఫోబ్ అడిలె గేట్స్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 133 బిలియన్‌ డాలర్లు. మైక్రోసాఫ్ట్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాక 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇప్పటివరకూ 54.8 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయగా.. ఇందులో 1,600 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close