రాజకీయం

బిహార్‌లో కలకలం : బీజేపీ నేతపై కాల్పులు

పట్నా : బీజేపీ బిహార్‌ రాష్ట్ర శాఖ ప్రతినిధి అజ్ఫర్‌ షంశిపై బుధవారం దుండగులు కాల్పులు జరిపాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న షంశికి మరో ప్రొఫెసర్‌తో వివాదం నెలకొన్న క్రమంలో జమాల్పూర్‌ కాలేజ్‌ వద్ద ఆయనపై దాడి జరిగింది. కాల్పుల్లో గాయపడిన బీజేపీ నేతను ఆస్పత్రికి తరలించామని, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని పోలీసులు తెలిపారు. అజ్ఫర్‌ శంషి తన చాంబర్‌కు వెళుతుండగా ఆయనపై ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారని తమకు సమాచారం అందిందని, కాలేజ్‌లో ఆయనతో వివాదం ఉన్న మరో ప్రొఫెసర్‌ను ఈ ఘటనలో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని మంగర్‌ జిల్లా ఎస్పీ తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నితీష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసుకుని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక రాజధాని పట్నాలో జనవరి 12న జరిగిన ఇండిగో ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌ రూపేష్‌ కుమార్‌ సింగ్‌ హత్య ఘటనపై నితీష్‌ సర్కార్‌పై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.  ఎయిర్‌లైన్స్‌ అధికారిని ఆయన నివాసం వద్ద దుండగులు కాల్చిచంపారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close