సినిమా

గృహప్రవేశం చేసిన ‘బిగ్ బాస్’ ఫేమ్ గంగవ్వ

  • బిగ్ బాస్-4లో సందడి చేసిన గంగవ్వ
  • ఇంటికి ఆర్థికసాయం చేసిన నాగార్జున
  • స్వగ్రామం లంబాడిపల్లిలో ఇల్లు నిర్మించుకున్న గంగవ్వ
  • గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే రవిశంకర్ తదితరులు

కొన్నాళ్ల కిందట వరకు సాధారణ పల్లెటూరి మహిళగా ఉన్న గంగవ్వ… మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ తో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆపై బిగ్ బాస్ రియాలిటీ షోతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దగ్గరైంది. తాజాగా గంగవ్వ తన కల నెరవేర్చుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిగ్ బాస్-4 సభ్యులు అఖిల్, శివజ్యోతి, మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ సభ్యులు, గంగవ్వ బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరయ్యారు.

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో గంగవ్వ ఎంట్రీ ఓ విచిత్రం. నగర వాతావరణానికి దూరంగా ఉండే గంగవ్వ వంటి మహిళకు బిగ్ బాస్ ఇంట్లో స్థానం కల్పిస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే తన పల్లెటూరి యాస, కల్మషం లేని వ్యక్తిత్వంతో గంగవ్వ బిగ్ బాస్ ఇంటి సభ్యులనే కాదు, బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే, ఆమెకు ఆరోగ్యం దెబ్బతినడంతో మధ్యలోనే షో నుంచి బయటికి వచ్చేసింది.

సొంత ఇల్లు నిర్మించుకోవడం ఆమె కల అని తెలుసుకున్న హోస్ట్ నాగార్జున అందుకు సాయం చేస్తానని మాటిచ్చారు. మాట నిలుపుకుంటూ ఆయన రూ.7 లక్షలు అందించగా, బిగ్ బాస్ షో నుంచి రూ.11 లక్షలు, సొంతడబ్బు మరో రూ.3 లక్షలు కలుపుకుని తన స్వగ్రామంలో లంబాడిపల్లిలో అందమైన ఇంటిని నిర్మించుకుంది. సొంత ఇంట్లోకి ప్రవేశించిన క్షణాన గంగవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో పోస్టు చేస్తే వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close