సినిమా

‘పుష్ప’ కోసం భారీస్థాయిలో విలేజ్ సెట్!

  • షూటింగు దశలో ‘పుష్ప’
  • బన్నీ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్
  • ప్రత్యేక ఆకర్షణగా ఊర్వశీ రౌతేలా ఐటమ్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే అడవి నేపథ్యంలోని సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. ఆ తరువాత చిత్రీకరణ కోసం ఆయన భారీస్థాయిలో విలేజ్ సెట్ ను  ఏర్పాటు చేయిస్తున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో రష్మిక గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఆమెకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి నగర శివార్లలోని ఒక ప్రదేశంలో విలేజ్ సెట్ వేయిస్తున్నారట. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని అంటున్నారు.

సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాకి కూడా విలేజ్ సెట్ వేయించిన సంగతి తెలిసిందే. ఎంతో సహజంగా అనిపించిన ఆ సెట్ ఆ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అలా ‘పుష్ప’ సెట్ కూడా ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ఈ నెల రెండవ వారం నుంచి ఈ సెట్లో షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, బన్నీ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close