రాజకీయం

రోడ్డుపై బైఠాయించిన ఎంపీ

కోల్‌కత్తా : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ బీజేపీకి చెందిన ఓ ఎంపీ రోడ్డుపై బైఠాయించారు. బెంగాల్‌లోని దక్షిణ దీనాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సుకుంటా మజుందార్‌ను లాక్‌డౌన్‌ కారణంగా తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించడంలేదు. గత ఇరవై రోజులుగా దీనాజ్‌పూర్‌లోకి ప్రవేశించేందుకు ఎంపీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ స్థానిక పోలీసులు అతన్ని అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సొంత నియోజకవర్గంలోకి అనుమతించడంలేదని మంగళవారం నడిరోడ్డుపై బైఠాయించారు. కరోనా కష్టకాలంలో తనను గెలిపించిన పేదలకు సేవచేయాలని భావిస్తున్నానని, కానీ దీనిని ప్రభుత్వం అడ్డుకోవడం సరైనది కాదని విమర్శించారు.

మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ ఆరోపిస్తోంది. దీనిపై అధికార తృణమూల్‌ నేతలు స్పందిస్తూ బీజేపీ నేతలు లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని అన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని అందుకే వారిని అనుమతించడంలేదని వివరించారు. తాజా ఘటనపై పోలీసులు వివరణ ఇస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఎవరినీ అనుమతించడంలేదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే తాము విధులను నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close