జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్స్పెషల్

మేకలు కాదు కేకులు కోయండి!

బక్రీద్‌ పండుగను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకలను బలి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. హైదరాబాద్‌లాంటి చోట్లైతే వారం రోజుల ముందు నుంచే, లక్షలాది గొర్రెల అమ్మకాలు జరుగుతాయి. ప్రధాన రోడ్లకు ఇరువైపులా గుంపులు గుంపులుగా పెట్టి వీటిని అమ్మేస్తుంటారు. వీటన్నింటినీ ఒకేరోజు చంపేయడం బాధాకరమైనప్పటికీ, మత సంప్రదాయం కావడంతో ఎవరూ దీని గురించి ప్రశ్నించలేకపోతున్నారు.

అయితే, ఇలా మూగజీవాల బలిని ఆపడం కోసం ఓ లక్నో బేకరీ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. బక్రీద్‌ పండుగకు మేకలను కోయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. మేక ఫోటోతో ఉన్న కేకులు తయారు చేసిన ఆయన, మేకలకు బదులు ఈ కేకులు కోయమంటున్నాడు.

బేకరి యజమాని ఆలోచనను కొంతమంది మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మతపరగా వచ్చిన సంప్రదాయాన్ని ఎలా కాదంటావంటూ ప్రశ్నిస్తున్నాడు. అయితే, ఆ బేకరీ యజమాని మాత్రం తన వల్ల పదిమంది మారినా చాలంటున్నాడు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close