అంతర్జాతీయం

చైనాలో మరో మహమ్మారి

  • ల్యాబ్‌నుంచి బ్రుసెల్లా బ్యాక్టీరియా లీక్‌
  • గన్షు ప్రావిన్స్‌లో వేలమందికి విస్తరణ

బీజింగ్‌: చైనాలో మరో మహమ్మారి వణుకు పుట్టిస్తున్నది. ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి ప్రమాదకరమైన బ్రుసెల్లా బ్యాక్టీరియా లీక్‌ కావటంతో వేలమంది మాల్టా వ్యాధి బారిన పడ్డారు. వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్‌ రాజధాని లాంగ్‌ఝౌలో ఉన్న ఝోంగ్‌ము లాంగ్‌ఝౌ బయోలాజికల్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నుంచి గతేడాది జూలై-ఆగస్టు మధ్య ఈ బ్యాక్టీరియా లీక్‌ అయినట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 3,245మందికి ఈ బ్యాక్టీరియా సోకిందని నిర్ధారించామని లాంగ్‌ఝౌ ఆరోగ్యవిభాగం ప్రకటించింది. ఈ బ్యాక్టీరియా సోకినవారు తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, అలసటతోపాటు దీర్ఘకాలికంగా ఆర్థరైటిస్‌ తదితర సమస్యలతో బాధపడుతారని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది. ఇది మనిషి నుంచి మనిషికి సోకటం అరుదని, బ్యాక్టీరియా సోకిన ఆహార పదార్ధాలు తినటం వల్ల వ్యాపించి ఉండవచ్చని పేర్కొంది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close