క్రైమ్టాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్

కోఠిలో ఆస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్‌ గురైన ఆరురోజుల పసికందు ఆచూకీ దొరికింది. చిన్నారి కర్ణాటకలోని బీదర్‌లో ఉన్నట్లు సుల్తాన్‌బజార్‌ పోలీసులు గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, బీదర్‌ పోలీసుల సహకారంతో ఒక్కరోజులోనే పోలీసులు మిస్టరీని ఛేదించారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన సబావట్‌ విజయ, నారి దంపతుల రెండో కూతురును సోమవారం గుర్తు తెలియని మహిళ టీకా ఇప్పిస్తానని ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే పోలీసులు ఆస్పత్రి వద్ద చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నీలి రంగు చీరలో ఉన్న మహిళ చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లుగా గుర్తించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ మహిళకు ఎంజీబీఎస్‌కు చేరుకుని 50వ ప్లాట్‌ఫాం నుంచి బీదర్‌ వెళ్లే బస్సు ఎక్కినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో జహీరాబాద్‌ బస్‌ డిపోకు చెందిన డ్రైవర్‌, కండక్టర్‌ చెప్పిన వివరాల మేరకు పాపను ఎత్తుకెళ్లిన మహిళ సాయంత్రం 5 గంటలకు బీదర్‌లోని నయాకమాన్‌ వద్ద బస్సు దిగినట్లు గుర్తించారు.

మొత్తం ఏడు బృందాలతో రంగంలోని దిగిన పోలీసులు కర్ణాటక పోలీసుల సహకారంతో బీదర్‌లోని నయాకమాన్‌ ప్రాంతంలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో కిడ్నాపర్‌ పసిపాపను నయాకమాన్‌ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వదిలేసి పరారైంది. దీంతో పాపను గుర్తించిన ఆస్పత్రికి సిబ్బంది చేరదీసి ఐసీయూలో చేర్చారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే బీదర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నయాకమాన్‌ ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వెళ్లిన చూడగా కోఠిలో కిడ్నాపైన పాపగా గుర్తించి పోలీసులు రిలాక్స్‌ అయ్యారు. అనంతరం పోలీసులు చిన్నారి తల్లిదండ్రులను బీదర్‌ తీసుకెళ్లారు.

క్షద్ర పూజల కోసమే కిడ్నాపర్‌ పాపను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చిన్నారి దొరికిన ప్రాంతంలో ఎక్కువగా క్షుద్రపూజలు జరుగుతుంటాయని స్థానికులు తెలిపారు. ఒక్కరోజు ఆలస్యమైనా ఘోరం జరిగి ఉండేదంటున్నారు స్థానికులు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close