క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్

120 మందిపై అత్యాచారం..బిల్లు బాబా బాగోతం

హర్యానా రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. రాష్ట్రంలోని ఫతేబాద్‌ తోహానా పట్టణానికి చెందిన అరవై ఏళ్ల బాబా 120 మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో చిత్రీకరించిన ఘటన సంచలనం రేపింది. ఫతేబాద్‌ తోహానా పట్టణానికి చెందిన బాబా అమర్‌పురి అలియాస్ బిల్లు 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు.

తన మొబైల్‌తో తీసిన అత్యాచారం వీడియో క్లిప్పులను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై బాబా పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాఫ్తులో తేలింది. అత్యాచారానికి గురైన 120 మంది మహిళల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాబా సమీప బంధువే అత్యాచార వీడియోలతో కూడిన సీడిని పోలీసులకు అందజేశాడు.

దీంతో ఫతేబాద్‌ మహిళా పోలీసు ఇన్స్‌పెక్టర్‌ బిమ్లాదేవి రంగంలోకి దిగి బాబా అమరపురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అత్యాచారానికి గురైన మహిళల వాంగ్మూలాల్ని రికార్డు చేస్తున్నామని ఆమె చెప్పారు. బాబా బాధితుల్లో ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారని, వివిధ ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆమె తెలిపారు. దేవాలయంలోనే తన భార్యపై బాబా అత్యాచారం జరిపాడని ఓ భక్తుడు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close