సినిమా

అల్లు అయాన్ మెసేజ్‌కి స్పందించిన టైగ‌ర్ ష్రాఫ్‌

అల్లు అర్జున్ త‌న‌యుడు అయాన్ నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. సోష‌ల్ మీడియాలో అయాన్‌కి సంబంధించిన విష‌యాల‌ని త‌ర‌చుగా షేర్ చేస్తుంటారు బ‌న్నీ దంప‌తులు. రీసెంట్‌గా త‌న కుమారుడు అయాన్ ప్రీ స్కూల్ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్ ట్వీట్ పెట్టాడు బ‌న్నీ. అయాన్‌కి మంచి పునాదులు వేసిన‌ బోధి వ్యాలీ స్కూల్ టీచర్లను అభినందిస్తూ, వారికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు. ఇక తాజాగా త‌న ఇనస్టాగ్రామ్ స్టోరీలో అయాన్‌కి సంబంధించి ఓ వీడియో షేర్ చేశాడు.

ఆ వీడియోలో అయాన్ .. హై టైగ‌ర్ స్క్వాష్‌, భాఘీ 3 చిత్ర షూటింగ్‌కి నేను రావొచ్చా అని ముద్దు ముద్దుగా మాట్లాడ‌తాడు. ఇందుకు బ‌న్నీ, ఆమె స‌తీమ‌ణి ఎందుకు అని అయాన్‌ని ప్ర‌శ్నించగా, నేను టైగ‌ర్ ష్రాఫ్ కండ‌ల శరీరంతో పాటు గ‌న్స్‌తో ఆయ‌న చేసే ఫైటింగ్‌ని లైవ్‌లో చూడాల‌ని అనుకుంటున్నాను అని చెబుతాడు. అయాన్ మాట్లాడిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన బ‌న్నీ టైగ‌ర్ ష్రాఫ్‌ని ట్యాగ్ చేయ‌గా, దీనికి టైగ‌ర్ నుండి సమాధానం వ‌చ్చింది. హహ‌.. నా కొత్త పేరు న‌చ్చింది. సార్‌.. అయాన్‌కి చెప్పండి. ఒక్క బాఘీ షూటింగ్‌కే కాదు, నేను చేయ‌బోయే ఏ సినిమా సెట్‌కైన అయాన్ రావ‌చ్చు అని స్వీట్ రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close