రాజకీయం

పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏపీని హేళన చేసి మాట్లాడుతుంటే బాధేస్తోంది -అచ్చెన్నాయుడు

  • అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర
  • ప‌లు పార్టీల మ‌ద్ద‌తు
  • భద్రత కల్పించాలని అచ్చెన్నాయుడు విన‌తి
  • రాజ‌ధానిని నిర్వీర్యం చేశార‌ని ఆగ్ర‌హం
  • ఏపీని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తే విమర్శలు వ‌చ్చేవి కావ‌ని విమ‌ర్శ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు టీడీపీ మద్దతు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఈ పాదయాత్రలో త‌మ పార్టీ నేత‌లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున‌ పాల్గొనాలని ఆయ‌న పిలుపునిచ్చారు. రాజ‌ధాని రైతులు చేస్తోన్న ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆయ‌న ఆకాంక్షించారు.

పాదయాత్రలో పాల్గొంటోన్న వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఏపీలో రైతులు ఉద్యమం చేస్తోంటే ప్ర‌భుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోవడం లేద‌ని అన్నారు. అమరావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేయ‌డంతో ఏపీ అప్పుల ఊబిలోకి వెళ్లిందని విమ‌ర్శించారు. పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని హేళనగా మాట్లాడుతుంటే బాధేస్తోందని చెప్పారు.
ఏపీని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తే ఇలాంటి విమర్శలు వ‌చ్చేవి కావ‌ని అన్నారు.

మ‌రోవైపు, రాజ‌ధాని రైతుల మహాపాద‌యాత్రకు సీపీఐ నారాయ‌ణ సంఘీభావం తెలిపారు. ఏపీ రాజ‌ధాని ఏదని ఎవ‌రైనా అడిగితే స‌మాధానం చెప్ప‌డానికే సిగ్గుచేటుగా ఉందని ఆయ‌న విమ‌ర్శించారు. పాద‌యాత్ర చివ‌రిరోజు తిరుప‌తిలో నిర్వ‌హించే స‌భ‌లో తాను పాల్గొంటాన‌ని  తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close