క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్

రైలులో ఇద్దరు మహిళలపై అత్యాచారం.. హత్య

అసోంలో దారుణం చోటుచేసుకుంది. రైలులో ఇద్దరు మహిళలపై లైంగికదాడి అనంతరం హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు వికాస్‌దాస్‌, విపిన్‌ పాండేలను దిగ్రూగర్‌ జిల్లాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసోం అగ్రికల్చర్‌ యూనివర్సిటీకిచెందిన 21ఏళ్ల విద్యార్థిని మృతదేహాన్ని శివసాగర్‌ జిల్లాలోని సిమలుగురి రైల్వేస్టేషన్‌లో గుర్తించగా, మరో మృతదేహాన్ని శుక్రవారం జోర్హాత్‌ జిల్లాలోని మరియాని స్టేషన్‌ వద్ద అవధ్‌ అస్సాం ఎక్స్‌ ప్రెస్‌ లో కనుగొన్నారు.

సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా వికాస్‌దాస్‌ను చిరింగ్‌ చపోరి ప్రాంతంలో అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. నేరాన్ని అంగీకరించిన దాస్‌ ఇచ్చిన సమాచారంతోనే మరో నిందితుడు పాండేను దిబ్రూగర్‌ స్టేషన్‌ నుంచి బెంగళూర్‌ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితులను ముందుగా స్పృహ కోల్పోయేటట్టు చేసి అనంతరం వారిపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం హత్యచేశామని, వారి మృతదేహాలను రైళ్లలో టాయ్‌లెట్స్‌ లో పడేశామని నిందితుడు వెల్లడించాడని పోలీసులు తెలిపారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close