కర్నూలుజాతీయంరాజకీయం

ఆర్టిక‌ల్ 370, ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు అయ్యేవి కాదు..

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంలో భాగంగా ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం దేశ ప్ర‌జ‌ల‌కు విజ‌న్‌ను, డైర‌క్ష‌న్‌ను ఇచ్చింద‌న్నారు. కానీ ప్ర‌తిప‌క్షాలు మాత్రం మా కార్యాచ‌ర‌ణ ప‌ట్ల ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నాయ‌న్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆశ్చ‌ర్యపోతున్నాయ‌న్నారు.  ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని మార్చ‌డ‌మే కాదు, ఆ ప్ర‌భుత్వంతో ముంద‌కు వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యార‌న్నారు. గ‌త 70 ఏళ్ల పాల‌న త‌ర‌హాలోనే ప్ర‌భుత్వం న‌డిస్తే.. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అయి ఉండేది కాద‌న్నారు. ట్రిపుల్ త‌లాక్‌ను కూడా ర‌ద్దు అయ్యేది కాద‌న్నారు.  ప్ర‌తిప‌క్షాల త‌ర‌హాలో ప్ర‌భుత్వం ఆలోచించి ఉంటే.. అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం నిజం అయ్యేది కాద‌ని ప్ర‌ధాని తెలిపారు. కర్తార్‌పూర్ కూడా వాస్త‌వ రూపం దాల్చేదికాద‌న్నారు.  రాజ‌కీయ స్థిర‌త్వం కోసం ఈశాన్యా రాష్ట్రాలు ఎన్నో ద‌శాబ్ధాలు వేచి చూశాయ‌న్నారు. కానీ మేం ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి స‌మీపం చేశామ‌న్నారు. బోడోలు ఆయుధాల‌ను విడిచిపెట్టిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.  ఎన్నో ఏళ్లుగా ఉన్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌న్నారు.  కొన్ని రాష్ట్రాలు పీఎం కిసాన్ స్కీమ్‌ను అమ‌లు చేయ‌డం లేద‌ని, రైతుల విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌వ‌ద్దు అని, మ‌నం అంద‌రం రైతుల‌ను విస్మ‌రించ‌కూడ‌ద‌న్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close