జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్స్పెషల్

మహాభారత కాలం నాటి అవశేషాలు లభ్యం

యూపీ సమీపంలోని సనౌలీ గ్రామంలో మహాభారత కాలం నాటి (క్రీ.పూ.2000-1800) రథాలు, కత్తులు, సమాధులు, శవపేటికలు, అస్థికలు భారత పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బటయపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని సనౌలీలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జూన్‌లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఈ అవశేషాలను ఎర్రకోటకు తరలించారు. శాస్త్రవేత్తలు వాటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అవి అలనాటి రాచకుటుంబానికి సంబంధించినవిగా భావిస్తున్నారు.

ఇలా పురావస్తు శాఖ తవ్వకాల్లో ఒక రథ బయటపడటం దేశచరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో గ్రీసు, మెసొపొటేమియాల్లో మాత్రమే ఇలా రథాలు బయటపడ్డాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతేకాదు.. నాలుగువేల ఏళ్లనాటి.. రాగి పిడి కలిగిన కత్తులను కనుగొనడం కూడా ఇదే తొలిసారి. ఇక సమాధుల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది సమాధులను కనుగొన్నారు. మరణాంతరం తినడానికన్నట్టు కొన్ని ఆహారపదార్థలు, దువ్వెనలు, అద్దాలు, బంగారు పూసలు కూడా ఆయా సమాధుల్లో ఉన్నాయి. కాగా ఈ సమాధుల్లో లభ్యమైన ఎముకలను, దంతాలను డీఎన్‌ఏ పరీక్షలకు కత్తులు, ఇతర పరికరాలను మెటలర్జికల్‌ పరీక్షలకు పంపుతున్నట్టు శాస్త్రజ్ఞులు వివరించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close