ఆంధ్ర

ట్రిపుల్‌ ఐటీ ఫలితాలు విడుదల

ఒంగోలు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మంత్రి సురేష్‌ ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో నిలిచినవారు..
1. ఎం. గుణశేఖర్‌ (ధర్మవరం, అనంతపురం)
2. శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్‌ జిల్లా)
3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా)
4. వెంకటసాయి సుభాష్‌ (జమ్మలమడుగు, వైఎస్సార్‌ జిల్లా)
5. జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా)

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close