ఆంధ్ర

AP PGCET: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

విజయవాడ: ఏపీ పీజీసెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించాం.  ఆన్‌లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించాము. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారు.

గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులకి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చు. ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ప్రవేశపరీక్షలలో ఎటువంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించాం అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close