ఆంధ్రటాప్ స్టోరీస్

సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ సీఎం జగన్‌

హైదరాబాద్‌ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ కోర్టుకు హాజరవడం ఇదే తొలిసారి. సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్లు నాంపల్లిలోని సీబీఐ కోర్టు తెలిపింది. డిశ్చార్జి పిటిషన్లు అన్ని కలిపి విచారణ జరపాలన్న జగన్‌ పిటిషన్‌పై ఇవాళ వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణను 17కు వాయిదా వేసింది కోర్టు.
గత ఎనిమిదేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు సహా ఈడీ నమోదు చేసిన 6 ఛార్జిషీట్లకు సంబంధించిన విచారణకు శుక్రవారం కచ్చితంగా హాజరుకావాలని జగన్‌, విజయసాయిరెడ్డిని ఈ నెల 3న సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో జగన్‌ ఇవాళ కోర్టులో హాజరయ్యారు. జగన్‌ గతేడాది మార్చి 22న చివరిసారిగా కోర్టుకు హాజరయ్యారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపే ఎయిర్‌పోర్టుకు జగన్‌ చేసుకున్నారు. అక్కడ్నుంచి నేరుగా నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్‌ వచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, విజయసాయి రెడ్డి, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ శామ్యూల్‌ విచారణకు హాజరయ్యారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close