సినిమా

కండ‌లు తిరిగిన దేహంతో టైగ‌ర్‌..ఫ‌న్నీ కామెంట్ చేసిన అనుప‌మ్

ఒకప్పుడు బాలీవుడ్ కండ‌ల వీరుడు అంటే స‌ల్మాన్ ఖాన్ గుర్తుకు వ‌చ్చే వారు. కాని ఇప్పుడు బాలీవుడ్‌ హీరో, జాకీష్రాఫ్‌ కుమారుడు టైగర్‌ష్రాఫ్ గుర్తుకు వ‌స్తున్నారు‌. శరీర సౌష్టవానికి  మొదటి ప్రాధాన్యత ఇచ్చే టైగ‌ర్ తాను ప‌ల‌క‌ల దేహంతో ఎప్పుడు ఇత‌రుల‌కి ఛాలెంజ్ విసురుతుంటారు. 28 ఏళ్ల టైగ‌ర్ ష్రాఫ్ అస‌లు పేరు జై హేమంత్‌ ష్రాఫ్ కాగా, ఇత‌ని  ఫస్ట్‌ సినిమా హీరో పంత్‌. 

బాఘీ ఫ్రాంచైజ‌లో వ‌చ్చిన బాఘీ, బాఘీ2, బాఘీ3 సినిమాలు టైగ‌ర్ క్రేజ్‌ని పెంచాయి. దాదాపు  యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల‌ని అల‌రిస్తూ ఉండే ఈ ప‌హిల్వాన్ ఇంత‌గా మార‌డానికి ఎన్ని క‌ష్టాలు ప‌డ‌తాడో. ఎప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న లుక్‌తో ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగించే టైగ‌ర్ ష్రాప్ తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేశాడు. దీనికి అనుపమ్ ఖేర్.. ఎముకలు క‌నిపిస్తున్నాయి. అన్నం తిన‌డం లేదా అంటూ స‌ర‌దాగా స్పందించారు. టైగ‌ర్ ష్రాఫ్ బాడీపై నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close