ఆంధ్ర

ఏపీ పాలిసెట్‌ 2020: ఫలితాలు విడుదల

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2020 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్‌ పాలిసెట్‌‌ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పాలిసెట్‌ 2020లో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సీఎస్‌ అనంతరాము తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. ‘పాలిసెట్‌ 2020 పరీక్షకు 88,372 మంది అభ్యర్థులు నమోదు చేసుకొన్నారు. అందులో 71,631 మంది పరీక్ష రాయగా 84 శాతంతో 60,780 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 50,706 మంది పరీక్షలు రాయగా 42,313 మంది ఉత్తీర్ణత  సాధించారు. బాలికలు 20,925 మంది పరీక్షలు రాయగా 18,467 మంది ఉత్తీర్ణత సాధించారు. పశ్చిమ గోదావరికి చెందిన మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 120 మార్కులతో టాప్ 1 లో నిలిచారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ ప్రణీత్ 119 మార్కులతో రెండో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సవిలత శ్రీదత్త శ్యామ సుందర్ 118 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటుకు సంబంధించి 271 కళాశాలల్లో 66,742 సీట్లు అందుబాటులో ఉన్నాయి’అని అనంతరాము పేర్కొన్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close