ఆంధ్ర

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం…కరోనాకు చెక్ చెప్పేందుకు…

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిపైనే కాకుండా ప్రజలందరి మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో సర్వే చేయించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ కూడా సర్వే చేయాలని.. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే.. సత్వరమే వారికి వైద్య సహాయం అందించాలని కోరారు.

సమగ్ర సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందని.. కోవిడ్‌–19 వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ కూడా విదేశాలనుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారేనని సీఎం తెలిపారు. సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు. రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందన్నారు. లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close