జాతీయంటాప్ స్టోరీస్

వీడియో..ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన బాలుడు

ఒలింపిక్స్‌లో పతకం సాధింస్తే వారి విజయం ప్రపంచానికి తెలుస్తుంది. పల్లెటూరి పిల్లలు ప్రపంచ విజేతలు కాకపోవచ్చు. కానీ ఇక్కడి చిన్నారులు అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించినంత ఆనందాన్ని పొందుతున్నారు. గల్లీలో  ఈ చిన్నారులు ఆడే ఆటలు వారికి ఎవరు నేర్పించారని ఆనందంగా ఆడేస్తున్నారు. గెలుపు సాధించిన విజయం వారి ముఖాల్లో వెలిగిపోతుంది. ఓ పక్క చినుకులు పడుతున్నా చెదరని చిరునవ్వుతో  పాతటైర్లో కూర్చొని రోడ్డుకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చక్కర్లు కొడుతున్నారు. సిటీల్లో ఉండే పిల్లలు పొందని ఆనందాన్ని వీరు సొంతం చేసుకున్నారు.

ఇప్పటి పిల్లలకు సరిగా ఆడుకోవడమే తేలీదు..ఎప్పుడూ వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు అంటూ నాలుగ్గోడల మధ్యే బాల్యాన్ని బంధించకుండా వీధుల్లో విహరిస్తున్నారు ఈ చిన్నారులు. మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఇలాంటి స్ఫూర్తి దాయక వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. తనని సైతం ఇన్‌స్పైర్ చేసిన విధానాన్ని వివరిస్తుంటారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close