జాతీయంటాప్ స్టోరీస్

అధికారం కాదు.. అభివృద్ధే ముఖ్యం: అమిత్‌షా

జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. పీడీపీతో తెగదెంపుల తర్వాత అమిత్‌షా తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాకు అధికారం కాదు.. అభివృద్ధే ముఖ్యమన్నారు. పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా అదే చెప్పామని తెలిపారు.

జమ్మూకాశ్మీర్‌ దేశానికి చాలా ముఖ్యమైన భాగమని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జమ్మూకాశ్మీర్‌ను భారత్‌ నుంచి విడదీయలేరని తెలిపారు. మిట్ట మధ్యాహ్నం ఓ జర్నలిస్టు హత్యకు గురికావడం దారుణమన్నారు. సైన్యంపై రాళ్లుదాడి చేయిస్తున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరగడం కూడా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్లు, జర్నలిస్టుల హత్యలతో ప్రభుత్వ పాలన సాధ్యం కాదన్నారు. జమ్మూ, లడఖ్‌లో అభివృద్ధి ఆగిపోయిందని అమిత్‌షా తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close