సినిమా

అమితాబ్ మీపై గౌర‌వం పోయింది: మ‌హిళ ట్వీట్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన ప‌డి ఇటీవ‌లే కోలుకున్నారు. అయితే క‌రోనా సోకిన‌ప్ప‌టి నుండి అమితాబ్ ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. అదే స‌మ‌యంలో వైద్యుల గురించి వారు చేస్తున్న సేవ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ప‌లు ట్వీట్స్ చేశారు. దీనిపై  జాన్వీ మఖీజా అనే మహిళ అమితాబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన‌వ‌స‌రంగా నానావ‌తి ఆసుప‌త్రికి ప‌బ్లిసిటీ చేస్తున్నారు. నేటి నుండి మీపై గౌరవం పోయింద‌ని ఆమె త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

వివ‌రాల‌లోకి వెళితే జాన్వీ మ‌ఖీజా త‌న తండ్రిని నానావ‌తికి తీసుకెళ్ళ‌గా అక్క‌డి వైద్యులు త‌ప్పుడు రిపోర్ట్‌ల‌తో ఆసుపత్రిలో అడ్మిట్ చేయించార‌ట‌. కొద్ది రోజుల త‌ర్వాత ఆయ‌న‌కి యాంటీ బాడీస్ టెస్ట్ చేయించాం. క‌రోనా సోక‌లేద‌ని తేలింది. డ‌బ్బుల కోసం నానావ‌తి ఆసుప‌త్రి వైద్యులు డ్రామా ఆడారు. ఇందులో  డబ్బుకు తప్ప ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. అలాంటి ఆసుపత్రికి మీరు కూడా ఈ స్థాయిలో పబ్లిసిటీ ఇస్తుండడం నాకు చాలా బాధ కలిగిస్తోంది.ఇన్నాళ్ళు మీపై మంచి గౌర‌వం ఉండేది. నేటితో అది పూర్తిగా పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

మ‌హిళ పోస్ట్‌కి స్పందించిన బిగ్ బీ..నేను ఎవ‌రికి ప‌బ్లిసిటీ చేయ‌లేదు.  నానావతి నుండి నాకు లభించిన సంరక్షణ మరియు చికిత్సకు నేను వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా. మీరు నా ప‌ట్ల గౌర‌వాన్ని కోల్పోయి ఉండ‌వ‌చ్చు. కాని  వైద్యుల ప‌ట్ల నాకు ఎప్ప‌టికీ గౌరవం ఉంటుంది. మీ తండ్రికి జ‌రిగిన దానికి నేను చింతిస్తున్నాను అని అమితాబ్ పేర్కొన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close