బిగ్ బీ టంగ్ ట్విస్టర్.. వీడియో వైరల్

ఎన్నో తరాల నటీనటులకి ఆదర్శం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఏడు పదుల వయస్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న అమితాబ్ తాజాగా గులాబో సితాబో అనే సినిమా చేశారు. జూన్ 12న ప్రైమ్‌లో విడుదల కానున్న ఈ సినిమాని సూజిత్ సర్కార్ తెరకెక్కించారు. మీర్జా షేక్‌గా అమితాబ్, ఆయన ఇంట్లో అద్దెకి ఉండే వ్యక్తి బాంకీ సోధిగా ఆయుష్మాన్ కనిపించనున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో హిందీ డైలాగ్‌ని ఐదుసార్లు తడబడకుండా చెప్పారు. ఇలానే చెప్పాలని విరాట్ కోహ్లీ, దీపిక పదుకొణే, రణభీర్ కపూర్, భూమిలకి ఛాలెంజ్ విసిరారు అమితాబ్. ఇది కష్టమైన పని భూమి కామెంట్ పెట్టగా,ఆయుష్మాన్ మాత్రం తనదైన శైలిలో పూర్తి చేశారు. దీనిని వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, తాప్సీ, కరణ్ జోహార్లకి విసిరారు. అమితాబ్ టంగ్ ట్విస్టర్పై ప్రశంసల జల్లు కురుస్తుంది.