టాప్ స్టోరీస్సినిమా

అమీర్‌ చిత్రం కోసం హాలీవుడ్‌ రేంజ్‌లో భారీ పడవలు

అమీర్ ఖాన్‌ తాజా చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఏడాదికి ఆయన ఒక్క సినిమా చేసినా అది మరో స్థాయిలో ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. పీకే, దంగల్, చిత్రాలు సృష్టించిన సంచలనాలే అందుకు నిదర్శనం. తాజాగా ఆయన విజయ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో నటిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో, కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా ఎక్కువ భాగం సముద్రం నేపథ్యంలో సాగుతుందట. దీని కోసం ఏకంగా రెండు లక్షల కిలోల బరువున్న భారీ పడవలు తయారు చేస్తున్నారట. ఈ చిత్రంలో అమీర్‌ కంటే సముద్రం, పడవలే కీలక భూమిక పోషిస్తాయని సమాచారం.

అందుకోసం కోట్లలో ఖర్చుపెట్టి ఆయా పడవలను యూరప్‌లోని  మాల్టా సముద్ర తీరంలో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వీటిని తయారు చేయడానికి ఏడాది పట్టిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటి వరకు హిందీ చిత్ర పరిశ్రమలోనే కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీగా సినిమాను తెరకెక్కించాలని అటు అమీర్, ఇటు నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. మంత్రముగ్ధుల్ని చేసే విజువల్ ఎఫెక్స్ట్ తో ఉండే ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయబోతున్నారట.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close