సినిమా

మ‌రోసారి అల్లుడు సెంటిమెంట్ న‌మ్ముకున్న యంగ్ హీరో

హీరోల‌కి, దర్శ‌కుల‌కి, నిర్మాత‌ల‌కి ఇలా ఎవ‌రి సెంటిమెంట్స్ వారికి ఉండ‌టం స‌హ‌జం. కొంద‌రు టైటిల్‌ని సెంటిమెంట్‌గా భావిస్తే మ‌రికొంద‌రు కాంబినేష‌న్‌ని సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త‌న తొలి సినిమా అల్లుడు శీను టైటిల్ సెంటిమెంట్‌ని త‌న తాజా చిత్రానికి వాడిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన డెబ్యూ చిత్రం అల్లుడు శీను ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్ళీ రాక్ష‌సుడు చిత్రంతో హిట్ అందుకున్నాడు.

ఇప్పుడు  ‘కందిరీగ‌’, ‘ర‌భ‌స’, ‘హైప‌ర్‌’ వంటి కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ . ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌పించబోతున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న  8 ప్యాక్స్‌తో మేకోవ‌ర్ అయ్యారు. దీనికి సంబంధించి శ్రీనివాస్ రగ్డ్ లుక్‌ను కూడా ఇటీవ‌ల  చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక తాజాగా చిత్ర టైటిల్ రివీల్ చేశారు మేక‌ర్స్. అల్లుడు అదుర్స్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుద‌ల కానున్న‌ట్టు పేర్కొన్నారు.  

సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ‘సింగం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన డూడ్లే ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘అల్లుడు శీను’, ‘జ‌య‌ జానకి నాయ‌క‌’ చిత్రాల త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది.  న‌భా న‌టేష్‌, అను ఎమ్మాన్యుయేల్ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close