సినిమా

మళ్లీ వార్తల్లోకి వచ్చిన అల్లు అర్జున్ ‘ఐకాన్’!

  • ‘అల వైకుంఠపురములో’కి ముందు చేయాల్సిన ‘ఐకాన్’  
  • స్క్రిప్టు పట్ల బన్నీ అసంతృప్తి వల్ల ఆగిపోయిన ప్రాజక్టు
  • ఆ ప్రాజక్టు తప్పకుండా ఉందంటున్న దర్శకుడు వేణు
  • కొరటాల శివ సినిమా తర్వాత వుండే అవకాశం

గతంలో అల్లు అర్జున్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేసిన ఒక సినిమాని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు వేణు శ్రీరాం దర్శకత్వంలో గతంలో అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్’ అనే సినిమా ప్రకటన వచ్చింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా ప్రకటించారు.

అయితే, అంతలోనే ఆ సినిమా సెట్స్ కి వెళ్లకుండా ఆగిపోవడం… ఆ స్థానంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రం రూపొందడం జరిగిపోయింది. స్క్రిప్టులో ఎక్కడో తనకు అసంతృప్తిగా ఉండడంతో ఆ ప్రాజక్టును బన్నీ హోల్డ్ చేసినట్టు వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం గురించిన సమాచారం వస్తోంది. ఈ చిత్రం ఆగిపోలేదనీ, ఈ సినిమా విషయంలో తాను బన్నీతో టచ్ లోనే ఉన్నాననీ దర్శకుడు వేణు శ్రీరాం తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది కచ్చితంగా ఉంటుందని కూడా అన్నాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ‘పుష్ప’ చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రాజక్ట్ కమిట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఈ ‘ఐకాన్’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళతారని అంటున్నారు. ఈలోగా వేణు శ్రీరాం ‘వకీల్ సాబ్’ చిత్రంతో హిట్ కొడితే కనుక ఇక ఆ ప్రాజక్టుకి ఢోకా వుండదు! 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close