సినిమా

భం అఖండ… భం భం అఖండ.. బాలకృష్ణ ‘అఖండ’ నుంచి టైటిల్ సాంగ్ విడుదల

  • బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా అఖండ
  • బోయపాటి దర్శకత్వంలో చిత్రం
  • తమన్ సంగీతం
  • టైటిల్ సాంగ్ కు సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ’ చిత్రం నుంచి నేడు టైటిల్ సాంగ్ రిలీజైంది. ‘భం అఖండ… భం భం అఖండ’ అనే ఈ టైటిల్ సాంగ్ ను చిత్రబృందం యూట్యూబ్ లో పంచుకుంది. ఈ హైఓల్టేజ్ సాంగ్ కు తమన్ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను మహదేవన్ త్రయం (శంకర్, సిద్ధార్థ్, శివం) ఆలపించింది.

ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య లుక్ విడుదల కాగా, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు నటిస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close