రాజకీయం

యూపీ అసెంబ్లీ పోల్స్‌.. తొలి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన ఏఐఎంఐఎం

ల‌క్నో : ఎన్నిక‌లు అంటే చాలు.. పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితా ఓ ప‌ట్టానా కొలిక్కి రాదు. అభ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేసే స‌రికి పార్టీల త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తుంది. ఇటువంటి ప్ర‌యాస‌ల‌కు ఆస్కారం లేకుండా ఇప్ప‌టినుంచి పోటీచేసే అభ్య‌ర్థుల‌ను ప‌రిచయం చేస్తూ ఎంఐఎం పార్టీ మాంచి దూకుడును కొన‌సాగిస్తుంది. ఎక్క‌డా? ఏంటీ అనుకుంటున్నారా? ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు 2022 ప్ర‌థ‌మార్థంలో జ‌ర‌గ‌నున్నాయి. 

ఈ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటీచేసే త‌న తొలి అభ్య‌ర్థిని ఆల్ ఇండియా మ‌జ్లిస్‌-ఇ-ఎత్తేహాదూల్ ముస్లీమీన్‌(ఏఐఎంఐఎం) ఇప్పుడే ప్ర‌క‌టించింది. భాగ‌స్వామ్య ప‌క్షాల‌తోని నామ‌మాత్ర‌పు సంప్ర‌దింపులు లేకుండానే ఏక‌గ్రీవంగా అభ్య‌ర్థి పేరును వెల్ల‌డించింది. బల్రాంపూర్ జిల్లాలోని ఉట్రౌలా అసెంబ్లీ స్థానానికి డాక్టర్ అబ్దుల్ మన్నన్‌ను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ఎంఐఎం ప్ర‌క‌టించింది. అబ్దుల్ మ‌న్న‌న్ కంటి వైద్యులు. పీస్ పార్టీని వ‌దిలి మ‌న్న‌న్ ఈ నెల ప్రారంభంలో ఏఐఎంఐఎంలో చేరారు. 

డిసెంబర్ 16న ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి లక్నోలో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్‌ను 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విష‌య‌మై క‌లిశారు. ఒక రోజు తరువాత ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (పీఎస్‌పీఎల్‌) చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ కూట‌మిలో చేరే విష‌య‌మై రాజ్భర్‌ను కలిసి చ‌ర్చించారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close