క్రైమ్

ఆప్ఘన్‌లో కారు బాంబు దాడి.. ఐదుగురు సైనికులు దుర్మరణం

కాబూల్‌ : ఆప్ఘన్‌లోని హెల్మాండ్‌ దక్షిణ ప్రావిన్స్‌లో బుధవారం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులతోపాటు నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్షియల్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి ఒమర్‌ జ్వాక్‌ తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నట్లు వెల్లడించారు. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. తాలిబన్లే ఈ హింసాత్మక ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబ‌న్లతో శాంతి చ‌ర్చ‌లు జరుగుతున్నా ఆప్ఘన్‌లో వరుస బాంబుదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close