క్రైమ్టాప్ స్టోరీస్

ర‌క్తం కారేలా జ‌ర్న‌లిస్టుల‌ను కొట్టిన‌ తాలిబ‌న్లు..

కాబూల్ : ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు జ‌ర్నలిస్టుల ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. వెస్ట్ర‌న్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ ఏరియాలో మ‌హిళ‌ల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌వ‌ర్ చేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌ను తాలిబ‌న్లు అడ్డుకున్నారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల‌ను తాలిబ‌న్లు అప‌హ‌రించి, ఓ గ‌దిలో బంధించారు. అక్క‌డ వారి బ‌ట్ట‌లు విప్పి.. దారుణంగా కొట్టారు. జ‌ర్న‌లిస్టుల శ‌రీర‌మంతా ర‌క్త‌పు మ‌ర‌క‌లే. కేవ‌లం వారి శ‌రీరంపై అండ‌ర్‌వేర్ మాత్ర‌మే ఉంది. ఆ ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల‌ను హింసిస్తూ, ఎగ‌తాళి చేశారు తాలిబ‌న్లు. తామిద్ద‌రం జ‌ర్న‌లిస్టులం అని మొత్తుకున్న‌ప్ప‌టికీ తాలిబ‌న్లు వినిపించుకోలేదు. జ‌ర్న‌లిస్టుల‌ను త‌ఖీ ద‌ర్‌యాబీ, నీమ‌తుల్లా న‌క్దీగా గుర్తించారు.

త‌మను ఎగ‌తాళి చేస్తూ చిత‌క‌బాదారు. తాలిబ‌న్లు త‌మ‌ను చంపేస్తారేమో అని భ‌యం క‌లిగింద‌ని జ‌ర్న‌లిస్టులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌తో కొంత మంది జ‌ర్న‌లిస్టుల‌ను అప‌హ‌రించి, ఆ త‌ర్వాత విడుద‌ల చేశార‌ని పేర్కొన్నారు. ఆప్ఘ‌నిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛ‌ను గౌర‌విస్తామ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వారి చ‌ర్య‌లు మ‌రోలా ఉన్నాయ‌ని జ‌ర్న‌లిస్టులు తెలిపారు. ఆప్ఘ‌న్ ప్ర‌జ‌ల నిర‌స‌న‌లను, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్ చేయొద్ద‌ని తాలిబ‌న్లు జ‌ర్న‌లిస్టుల‌ను హెచ్చ‌రించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close