క్రైమ్

నేటితో ముగియనున్న ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ గురువారంతో ముగియనున్నది. ఆయనను నాలుగో రోజు అవినీతి నిరోధకశాఖ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మాదాపూర్‌కు చెందిన మహిళ పేరుతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంతకు మూడు రోజుల కస్టడీలో ఆయన నర్సిం‌హా‌రెడ్డి నోరు విప్పలేదని తెలుస్తోంది. అక్రమార్జన, వాటితో కూడ‌బె‌ట్టిన ఆస్తు‌లకు సంబం‌ధించి ఏసీబీ అధి‌కా‌రులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని సమాచారం. మాదా‌పూ‌ర్‌లో భూము‌ల‌తో‌పాటు మొత్తం 25 చోట్ల జరి‌పిన సోదాల్లో పట్టు‌బ‌డిన పత్రా‌ల‌పైనా ఆరా తీసి‌నట్టు తెలి‌సింది.

కస్టడీకి గురువారం ఒకే రోజు ఉండడంతో మరింత కీలక సమాచారం సేకరణకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, మాదా‌పూ‌ర్‌లో భూకబ్జా వ్యవ‌హా‌రంలో ఇప్పటికే ఎనిమిది మందిని అరె‌స్టు ‌చే‌సిన ఏసీబీ అధి‌కా‌రులు, మరో ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం చేశారు. స్థలం కొను‌గోలు కోసం సృష్టిం‌చిన పత్రా‌ల్లోనూ అన్ని సర్వే‌నం‌బర్లు, ఇతర సమా‌చారం తప్పు అనేం‌దుకు అవ‌స‌ర‌మైన ఆధా‌రా‌లను సేక‌రిం‌చి‌నట్టు తెలి‌సింది. రిజి‌స్ర్టే‌షన్‌ కాగి‌తా‌ల్లోని సర్వే‌నం‌బర్లు, ప్రభుత్వ రికా‌ర్డుల్లో పరి‌శీ‌లిం‌చగా అన్నీ ఫేక్‌ అని, ఇతర ప్రాంతాల సర్వే‌నం‌బ‌ర్లను వేసి రిజి‌స్ర్టే‌షన్‌ చేసు‌కు‌న్నట్టు కీలక ఆధా‌రాలు లభించినట్లు సమాచారం. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close