క్రైమ్

‘ఆమె’ వస్తే .. మరిన్ని విషయాలు వెలుగులోకి!

హైద‌రా‌బాద్: అక్ర‌మాస్తుల కేసులో ప‌ట్టుబ‌డిన ఏసీపీ న‌ర్సింహారెడ్డి.. నాలుగు రోజుల కస్ట‌డీలో భాగంగా ఏసీబీ అధి‌కా‌రులు అడి‌గిన ఏ ప్రశ్నకూ సరైన సమా‌ధా‌నాలు చెప్ప‌లే‌దని తెలి‌సింది. సోదాల్లో పట్టు‌బ‌డిన, ఇతర దర్యా‌ప్తులో సేక‌రిం‌చిన పత్రాలు, ఆధా‌రా‌లను ముందుంచి ప్రశ్నిం‌చినా ఏసీపీ నుంచి ఆశిం‌చిన మేర సమా‌ధా‌నాలు రాలే‌దని సమా‌చారం. రూటు మార్చిన ఏసీబీ అధి‌కా‌రులు మరో పంథాలో కూపీ లాగు‌తు‌న్నట్టు తెలి‌సింది. ఇప్ప‌టికే పట్టు‌బ‌డిన ఆస్తుల్లో నర్సిం‌హా‌రెడ్డి బినా‌మీ‌లుగా గుర్తిం‌చిన వారి‌గు‌రించి ఆరా తీస్తు‌న్నారు. 

మాదా‌పూర్‌ భూకొ‌ను‌గో‌లులో నర్సిం‌హా‌రెడ్డి బినా‌మీలు 8 మంది ఉన్నట్లు, మాదా‌పూ‌ర్‌కు చెందిన ఓ మహి‌ళతో ఏసీ‌పీకి సన్ని‌హిత సంబం‌ధా‌లు‌న్నట్టు, ఆమె పేరిట కూడా శంక‌ర్‌‌ప‌ల్లి‌తో‌పాటు పలు‌చోట్ల ఆస్తు‌లను కొను‌గో‌లు‌చే‌సి‌నట్టు వెలు‌గు‌లోకి వచ్చాయి. సదరు మహిళ ప్రస్తుతం విదే‌శాల్లో ఉన్నట్టు ఏసీబీ అధి‌కా‌రులు తమ దర్యా‌ప్తులో తెలు‌సు‌కు‌న్నారు. ఆమె స్వదే‌శా‌నికి వస్తే మరిన్ని కీలక విష‌యాలు తెలిసే అవ‌కాశం ఉన్నట్లు భావి‌స్తు‌న్నారు. మాదా‌పూ‌ర్‌లో ఇప్ప‌టికే గుర్తిం‌చిన రూ.50 కోట్ల విలు‌వైన స్థలం‌తో‌పాటు ఖరీ‌దైన ఇంటిని నర్సిం‌హా‌రెడ్డి కొను‌గో‌లు‌చే‌సి‌నట్టు అధి‌కా‌రులు పత్రాలు సేక‌రిం‌చారు. వీటి ప్రకారం మాదా‌పూర్‌ మహిళ పేరిటే ఈ ఆస్తి సైతం ఉన్నట్టు ప్రాథ‌మి‌కంగా నిర్ధా‌రిం‌చారు. నాలు‌గు‌రో‌జుల కస్టడీ ముగి‌య‌డంతో నర్సిం‌హా‌రె‌డ్డిని న్యాయ‌స్థా‌నంలో హాజ‌రు‌ప‌రిచి, తిరిగి చంచ‌ల్‌‌గూడ జైలుకు తర‌లిం‌చారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close