జాతీయంటాప్ స్టోరీస్

9 మందికి కొత్త కరం కరోనా.. 38కి చేరిన కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. తాజాగా మరో 9 మందిలో బ్రిటన్‌ స్ట్రైయిన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 38కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఢిల్లీలోని ఐజీఐబీలో 11, ఢిల్లీలోని ఎన్‌సీడీసీలో 8, బెంగళూరులోని ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో 10,  పూణేలోని ఎన్‌ఐవీలో 5, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, కోల్‌కతాలోని ఎన్సీబీజీలో ఒకటి చొప్పున కొత్త రకం కరోనా వైరస్‌ను నిర్ధారించినట్లు వివరించింది. 

బ్రిటన్‌తో పాటు ఐరోపా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి కలకలం రేపుతున్నది. కాగా, నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 23 మధ్యరాత్రి వరకు యూకే నుంచి దేశంలోని పలు విమానాశ్రయాలకు సుమారు 33 వేల మంది ప్రయాణికులు చేరుకున్నారు. వీరిలో వందల మందికి కరోనా సోకింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి నమూనాలను జాతీయస్థాయి ల్యాబ్స్‌కు పంపారు. 

సోమవారం నాటికి దేశంలోని పలు జాతీయస్థాయి ల్యాబ్స్‌ వెల్లడించిన రిపోర్టుల ప్రకారం ఇప్పటి వరకు 38 మందికి బ్రిటన్‌ స్ట్రైయిన్‌ సోకినట్లు తేలింది. జనవరి 1కి 29గా ఉన్న కొత్త రకం కరోనా కేసుల సంఖ్య మూడు రోజుల్లో 38కి చేరింది.  ఈ కేసుల పెరుగుదలతోపాటు ఈ నెల 6 నుంచి బ్రిటన్‌కు విమానాలు పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close