క్రైమ్

గుంటూరు జిల్లాలో వివాహిత‌పై సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిది మంది అరెస్టు

  • మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద గ‌త రాత్రి ఘ‌ట‌న‌
  • దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించిన పోలీసులు
  • పాలడుగు దగ్గర కోల్డ్‌ స్టోరేజ్‌లో పనిచేసే వారిగా గుర్తింపు
  • వారంద‌రూ ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులన్న పోలీసులు\

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఓ వివాహిత‌పై దుండ‌గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే.  గుంటూరులో జరిగిన ఓ వివాహానికి హాజరైన సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గత రాత్రి బైక్‌పై తిరిగి బయలుదేరి వెళ్తుండ‌గా వారిని అడ్డగించిన దుండగులు మహిళ భర్తపై దాడి, మ‌హిళ‌పై అత్యాచారం చేశారు.

దీనిపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు పురోగతి సాధించారు. దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి, పాలడుగు దగ్గర కోల్డ్‌ స్టోరేజ్‌లో పనిచేసే ఎనిమిది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారంద‌రూ ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close