రాజకీయం

ఒక్క గెలుపు కోసం.. 74 ఏళ్ల వయసులో 93వ సారి ఎన్నికల బరిలోకి!

  • 93వ సారి ఎన్నికల బరిలోకి
  • మిగతా ఏడూ పూర్తి చేసి రికార్డులకెక్కుతానన్న హసనురామ్
  • ఈసారి భార్యపైనే పోటీ

ఒక్క గెలుపు కోసం.. ఒకే ఒక్క గెలుపు కోసం ఓ వ్యక్తి 1985 నుంచి వచ్చిన ప్రతీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నాడు. అయినా విజయం అల్లంత దూరంలోనే నిలిచిపోతోంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజాగా 74 ఏళ్ల వయసులో మరోమారు ఎన్నికలకు సిద్ధమయ్యాడు అంబేడ్కరీ హస్నురామ్.

ఆయనది ఉత్తరప్రదేశ్‌, ఆగ్రా జిల్లాలోని ఖైరాగఢ్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే ఆయన జన్మించాడు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు.

1985లో తొలిసారి బీఎస్పీ తరపున ఎన్నికల బరిలోకి దిగాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అయినప్పటికీ విజయం మాత్రం వరించడం లేదు. 1988లో బీఎస్పీకి రాంరాం చెప్పి ఖైరాగఢ్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అయినా పరాజయమే ఎదురైంది. ఇలా ఇప్పటి వరకు 92సార్లు పోటీ చేసిన హస్నురామ్  ఈసారి జిల్లా పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచాడు.

మళ్లీ ఓడినా సరే మరో ఏడు సార్లు పోటీ చేస్తానని, ఫలితంగా వంద సార్లు ఓటమి పాలైన వ్యక్తిగా ఓ రికార్డు తన సొంతమవుతుందని హస్నురామ్ నవ్వుతూ చెప్పాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి ఆయన ఏకంగా తన భార్య శివదేవిపైనే పోటీకి దిగుతుండడం. దీంతో ఇప్పుడు భార్యాభర్తల పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close