జాతీయంటాప్ స్టోరీస్

650 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు శాఖల ప్రారంభం

తపాలా శాఖ  ప్రారంభిస్తున్న ఇండియాపోస్ట్  పేమెంట్స్ బ్యాంకుకు దేశ వ్యాప్తంగా ఉన్న 1.55 లక్షల తపాలా శాఖలు అనుసంధానం కానున్నాయి. వీటిలో 1.30 లక్షల వరకూ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్‌ సిన్హా  వెల్లడించారు. ఒకేసారి 650 ఇండియా పోస్ట్ పేమెంట్‌ బ్యాంకు శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నట్లు మంత్రి బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఒక బ్యాంకు  తరహాలో ఈ పేమెంట్‌ బ్యాంకు పని చేస్తుందని మంత్రి వివరించారు.

ఒకటి రెండు రోజుల్లోనే ప్రారంభం తేదీని నిర్ణయిస్తామని సిన్హా  లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ఈ బ్యాంకు లక్ష రూపాయల వరకూ ఒక ఖాతకు డిపాజిట్లు తీసుకుంటుందని, వ్యక్తులు, చిన్నచిన్న వ్యాపారుల నుంచి సైతం డిపాజిట్లు సేకరిస్తుందన్నారు. ప్రతి లోక్‌సభ నియోజక వర్గంలో ఒక పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రస్తుతం దేశంలో 251 పాస్‌ పోర్టు సేవా కేంద్రాలున్నాయని, 50 కిలోమీటర్ల పరిధిలో ఒక పాస్‌ పోర్టు సేవా కేంద్రం ఉండాలన్న లక్ష్యంతో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సిన్హా  వెల్లడించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close