జాతీయం

18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భార‌తీయ మ‌హిళ‌

ముంబై : ఓ భార‌తీయ మ‌హిళ 18 సంవ‌త్స‌రాల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభ‌వించింది. చివ‌ర‌కు ఔరంగబాద్ పోలీసుల ప్ర‌య‌త్నంతో ఆమె పాక్ జైలు నుంచి విడుద‌లైంది. ఔరంగ‌బాద్‌కు చెందిన హ‌సీనా బేగం(65) 18 ఏండ్ల క్రితం త‌న భ‌ర్త బంధువులను చూసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఈ క్ర‌మంలో ఆమె పాస్‌పోర్టు లాహోర్‌లో మిస్ అయింది. దీంతో ఆమెను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు త‌ర‌లించారు. 

అయితే హ‌సీనా బేగం అదృశ్య‌మైన‌ట్లు ఆమె బంధువులు 18 ఏండ్ల క్రితం ఔరంగాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ పోలీసు వ‌ర్గాల‌కు ఔరంగబాద్ పోలీసులు లేఖ రాశారు. అలా హ‌సీనా ఆచూకీ ల‌భ్య‌మైంది. ఆమె అక్క‌డి జైల్లో ఉన్న‌ట్లు పాక్ వ‌ర్గాలు తెలిపాయి. మొత్తానికి ఔరంగ‌బాద్ పోలీసుల ప్ర‌య‌త్నంతో హ‌సీనా ఇండియాకు తిరిగొచ్చింది.

స్వ‌ర్గంలో ఉన్న‌ట్టు ఉంది : హ‌సీనా

పాక్ జైలు నుంచి విడుద‌లై సొంతూరుకు తిరిగొచ్చిన హ‌సీనా బేగం మాట్లాడుతూ.. స్వ‌దేశానికి రావ‌డంతో స్వ‌ర్గంలో ఉన్న‌ట్టు ఉంద‌న్నారు. పాకిస్తాన్‌లో తాను అనేక క‌ష్టాలు ఎదుర్కొన్నాను. ఇక్క‌డి గాలి పీల్చుకోవ‌డంతో ప్ర‌శాంతంగా ఉంద‌ని తెలిపారు. ఔరంగబాద్ పోలీసుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు హ‌సీనా పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close