క్రైమ్జాతీయంటాప్ స్టోరీస్

50 ఏళ్ల తర్వాత దొరికిన సైనికుడి మృతదేహం

విమాన ప్రమాదంలో చనిపోయిన ఓ సైనికుడి మృతదేహం దాదాపు 50 ఏళ్ల తర్వాత లభ్యమైంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచుకొండలపై ఉన్న చెత్తను పర్వతారోహకులు శుభ్రం చేస్తుండగా ఈ మృతదేహం బయట పడింది. ఇండియన్ మౌంటెయినింగ్ ఫౌండేషన్‌ ఈ క్లీన్లీనెస్ డ్రైవ్‌ను చేపట్టింది. ధాకా గ్లేసియర్ బేస్‌ క్యాంప్‌ వద్ద పర్వతారోహకులు శుభ్రం చేస్తుండగా తొలుత విమాన శకలాన్ని గుర్తించారు. కొద్ది దూరంలోనే సైనికుడి మృతదేహం లభ్యమయ్యింది.

‘తొలుత మాకు విమాన శకలాలు దొరికాయి. తర్వాత మా బృంద సభ్యులు శకలాలు దొరికిన  ప్రదేశానికి కొద్ది దూరంలోనే మృతదేహాన్ని గుర్తించారు. వాటిని ఫోటో తీసి ఆర్మీ హై ఆల్టిట్యూట్ వెల్ఫేర్‌ స్కూల్‌కు పంపించాం. 1968లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి మృతదేహంగా గుర్తించారు.’ అని క్లీన్ డ్రైవ్ టీమ్ లీడర్ రాజీవ్ రావత్ తెలిపారు.

1968, ప్రిబవరి 7వ తేదీన చండీగఢ్ నుంచి 98 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో లేహ్ బయలు దేరిన విమానం రోహ్‌తంగ్ సమీపంలో కూలిపోయింది. దాదాపు 35 ఏళ్ల  తర్వాత 2003లో ఈ విమాన శకలాన్ని ఢాకా గ్లేసియర్‌ వద్ద గుర్తిచారు.  ఆ తర్వాత 2003 నుంచి 2017 వరకు గాలింపు చర్యలు చేపట్టగా ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా పలువురి మృతదేహాలు ఆ మంచులోనే ఎక్కడో కూరుకుపోయి ఉంటాయని వాటి కోసం గాలింపు చర్యలు చేపడతామని అధికారులు అప్పట్లో తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close