అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో 4.2 తీవ్ర‌త‌తో భూకంపం

అమెరికాలో కాలిఫోర్నియాలో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 4.2 తీవ్ర‌త‌తో భూప్ర‌కంపం న‌మోదు అయ్యింది. న‌ష్టానికి సంబంధించిన ఎటువంటి రిపోర్ట్ అంద‌లేదు.  ప‌సిఫిక్ కాల‌మానం ప్ర‌కారం తెల్ల‌వారుజామున 4.29 నిమిషాల‌కు భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి.  9 నిమిషాల త‌ర్వాత రెండ‌వ సారి 3.3 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. నార్త్ హాలీవుడ్‌, షెర్మాన్ ఓక్స్ ప్రాంతాల్లో స్థానికులు ప్ర‌కంప‌న‌ల‌ను గుర్తించారు. త‌మ‌కు ఎటువంటి అల‌ర్ట్ రాలేద‌ని కొంద‌రు చెప్పారు.  

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close