సినిమా

11 ఏళ్ళ మ‌గ‌ధీర‌.. ఎన్నో జ్ఞాప‌కాలు

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ , క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం మ‌గ‌ధీర‌. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం అనేక రికార్డులు కూడా బ‌ద్దలు కొట్టింది. చిత్రంలో చ‌ర‌ణ్‌, కాజ‌ల్, శ్రీహ‌రి పాత్ర‌లు ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాయి. ముఖ్యంగా శ్రీహ‌రి-రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య సాగే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌కి సినీ ప్రియులు ఫిదా అయ్యారు

గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో అల్లు అరవింద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మ‌గ‌ధీర చిత్రం విడుద‌లై నేటికి 11 ఏళ్ళు అవుతుంది. ఆ నాటి సంగ‌తుల‌ని చిత్ర బృందంతో పాటు ఫ్యాన్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చ‌రణ్ ఫ్యాన్స్  శ్రీహ‌రికి ట్రిబ్యూట్‌గా స్పెష‌ల్ వీడియో రూపొందించి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మ‌రోవైపు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ త‌మ ట్విట్ట‌ర్‌లో మగధీర .. ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసిన సినిమా. ఫిల్మ్ మేకింగ్‌లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విడుదల తర్వాత దక్షిణాదిలోనే నెంబర్ వన్‌గా నిలిచింద`ని ట్వీట్ చేసింది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close